
ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నారు పూరి. అందుకే హిట్ సెంటిమెంట్‌ని దేన్నీ వదలడం లేదు. రామ్ హీరోగా ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ తెరకెక్కిస్తున్నారు.

ఈ డబుల్ ఇస్మార్ట్ అటు డైరక్టర్‌కి, ఇటు హీరోకి డబుల్ కంబ్యాక్ అవుతుందా? డబుల్ మ్యాడ్‌నెస్‌కి రెడీగా ఉండండి అంటూ టీమ్‌తో మణిశర్మ జాయిన్ అయిన విషయాన్ని హ్యాపీగా ప్రకటించారు పూరి అండ్ టీమ్.

ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌లో కథకు, రామ్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కీ ఎంత ఇంపార్టెన్స్ ఉందో, మణిశర్మ మ్యూజిక్‌కి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది.

అందుకే ఇప్పుడు సీక్వెల్‌లోనూ అదే మేనియా కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయిపోయారు పూరి. ఇస్మార్ట్ శంకర్‌తో రామ్‌ని మాస్ హీరోగా ఎలివేట్ చేశారు పూరి.

ఆ హిట్ జోష్‌తో విజయ్ దేవరకొండ హీరోగా పూరి చేసిన ప్యాన్ ఇండియా సినిమా లైగర్ ఫ్లాప్ అయింది. అందులో నుంచి కంబ్యాక్ కావడానికి మళ్లీ ఇస్మార్ట్ స్టోరీనే సెలక్ట్ చేసుకున్నారు కెప్టెన్.

సినిమా సక్సెస్ కావడానికి ఏయే ఎలిమెంట్ హెల్ప్ అవుతుందో, అన్నిటినీ తీసుకుంటున్నారు డైరక్టర్.

ఈ డబుల్ ఇస్మార్ట్ తో రామ్‌ని ప్యాన్ ఇండియా హీరోగా, మణిశర్మని ప్యాన్ ఇండియన్ మ్యూజిక్ డైరక్టర్‌గా నిలబెట్టి, చాన్నాళ్లుగా తాను ఎదురుచూస్తున్న హిట్ అందుకోవాలన్న ఏకైక లక్ష్యంతో పనిచేస్తున్నారు పూరి జగన్నాథ్.