సైంధవ్ సినిమాతో నిరాశపరిచిన విక్టరీ స్టార్ వెంకటేష్ నెక్ట్స్ సినిమా మీద ఫోకస్ పెట్టారు. ప్రయోగాలు వర్క్ అవుట్ కాకపోవటంతో అప్‌కమింగ్ సినిమాకు హిట్ ఫార్ములాను రిపీట్ చేయాలని ఫిక్స్ అయ్యారు.
ఇంతకీ వెంకీ రిపీట్ చేస్తున్న ఆ సెంటిమెంట్ ఏంటి..? సంక్రాంతి బరిలో సైంధవ్‌గా ఎంట్రీ ఇచ్చిన వెంకటేష్ అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయారు.
యాక్షన్ థ్రిల్లర్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమా నిరాశపరచటంతో నెక్ట్స్ మూవీ విషయంలో ప్లాన్ మార్చారు వెంకీ. తనకు బాగా పట్టున్న జానర్‌ను పిక్ చేసుకునే ప్లాన్‌లో ఉన్నారు విక్టరీ హీరో.
వెంకటేష్ మెయిన్ స్ట్రెంగ్త్ కామెడీ. కామెడీ ఎంటర్‌టైనర్‌లుగా తెరకెక్కిన వెంకటేష్ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. అందుకే తన నెక్ట్స్ సినిమాను అదే జానర్‌లో ప్లాన్ చేస్తున్నారు వెంకీ.
గతంలో తనకు ఎఫ్ 2లాంటి సూపర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీకి రెడీ అవుతున్నారు. ఎఫ్ 2 తరువాత అనిల్ దర్శకత్వంలోనే ఎఫ్ 3 సినిమా చేశారు వెంకీ.
ఆ సినిమా సక్సెస్ కాకపోయినా మరోసారి అనిల్ రావిపూడికి ఛాన్స్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. ఈ సినిమాను కూడా దిల్ రాజు బ్యానర్‌లోనే చేయబోతున్నారు.
యాక్షన్ జానర్‌ను పక్కన పెట్టి మరోసారి కామెడీ ట్రై చేస్తున్న వెంకీ... మరోసారి హిట్ ట్రాక్‌లోకి వచ్చేందుకు కష్టపడుతున్నారు. మరి అనిల్ రావిపూడి సినిమాతో విక్టరీ హీరో సక్సెస్ ట్రాక్‌లోకి వస్తారేమో చూడాలి.