800: లెజెండరీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కుతున్న సినిమా 800. ఆయన టెస్ట్ క్రికెట్‌లో తీసిన 800 వికెట్లనే సినిమా టైటిల్‌గా పెట్టారు మేకర్స్. ఎమ్మెస్ శ్రీపతి దీనికి దర్శకుడు. తాజాగా ముంబైలో ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ వేడుక జరిగింది. దీనికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌తో పాటు సనత్ జయసూర్య హాజరయ్యారు.
Weapon:సత్యరాజ్, వసంత్ రవి ప్రధాన పాత్రల్లో గుహన్ తెరకెక్కిస్తున్న సినిమా వెపన్. ఈ సినిమా తెలుగు గ్లింప్స్‌ను హైదరాబాద్‌లో విడుదల చేసారు మేకర్స్. ఈ కార్యక్రమంలో చిత్రయూనిట్ అంతా హాజరయ్యారు. ఈ మధ్యే విడుదలైన జైలర్‌లో రజినీకాంత్ కొడుకుగా నటించి మెప్పించారు వసంత్ రవి. అలాగే అశ్విన్స్ సినిమాలోనూ ఈయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు వెపన్‌తో వస్తున్నారీయన.
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాను విడుదలకు ముందే చూసారు. నవీన్ పొలిశెట్టి, అనుష్క జంటగా మహేష్ బాబు తెరకెక్కించిన ఈ చిత్రం పూర్తిగా హిలేరియస్ ఎంటర్‌టైనర్ అని.. కచ్చితంగా ప్రేక్షకులను మెప్పించడం ఖాయం అని చెప్పారు చిరు. సెప్టెంబర్ 7న ఈ సినిమా విడుదల కానుంది.
Tiger Nageswara Rao: రవితేజ, వంశీ కాంబినేషన్‌లో వస్తున్న పీరియాడిక్ సినిమా టైగర్ నాగేశ్వరరావు. తాజాగా ఈ సినిమా నుంచి ఏక్ ధమ్ ధమ్ అంటూ సాగే పాట విడుదలైంది. ఇందులో బందిపోటుగా నటిస్తున్నారు మాస్ రాజా. ఈయనకు ఇదే మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో నుపుర్ సనన్ సహా మరో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. సినిమా త్వరలోనే విడుదల కానుంది.
Vishwak Sen:చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న విశ్వక్ సేన్ గామి చిత్రం అప్‌డేట్ వచ్చింది. నిజానికి ఎప్పుడో రావాల్సిన ఈ చిత్రం ఇంకా రిలీజ్ కాలేదు. తాజాగా ఈ సినిమా అప్‌డేట్ వచ్చింది. అడ్వెంచరస్ ఫాంటసీ ఫిల్మ్‌గా రాబోతున్న ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అఘోరాగా కనిపించబోతున్నాడు. విద్యాధర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చాందినీ చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా సినిమాకు డబ్బింగ్ మొదలు పెట్టారు మాస్ కా దాస్.