
రామ్ చరణ్, తారక్ హీరోలుగా నటించిన RRR చూసాక.. దానికి సీక్వెల్ వస్తుందని.. ఉంటుందని ఎవరూ అనుకోరు. ఎందుకంటే ఆ కథను అంత పర్ఫెక్టుగా ముగించారు దర్శకుడు ధీరుడు రాజమౌళి.

కానీ రిలీజ్ అయ్యాక వరల్డ్ వైడ్‌గా అది సృష్టించిన సంచలనం చూసి పార్ట్ 2 చేస్తే బాగుంటుందనే ఆలోచన దర్శక నిర్మాతలకు వచ్చింది. ఆ మధ్య ఆస్కార్ సమయంలో రాజమౌళి కూడా ఇదే చెప్పారు.

ట్రిపుల్ ఆర్ సీక్వెల్‌పై రెండేళ్ళ కిందే కన్ఫర్మేషన్ ఇచ్చారు విజయేంద్రప్రసాద్. కథ కూడా సిద్ధంగా ఉందన్నారు. అయితే రాజమౌళి చెప్పలేదు కాబట్టి ఎవరూ సీరియస్‌గా తీసుకోలేదు.

కానీ తాజాగా RRR డాక్యుమెంటరీకి వస్తున్న రెస్పాన్స్ చూసి.. సీక్వెల్‌పై సీరియస్‌గా ఆలోచిస్తున్నారు మేకర్స్. రాజమౌళి కూడా పార్ట్ 2 చేస్తే బాగుంటుందంటున్నారు. RRR సీక్వెల్ ఆలోచన బాగానే ఉన్నా.. ఆచరణ అంత ఈజీ కాకపోవచ్చు. SSMB 29 అయ్యేసరికే కనీసం మూడేళ్ళు పడుతుంది.

మరోవైపు రామ్ చరణ్, ఎన్టీఆర్ మరో మూడు నాలుగేళ్లకు సరిపోయే ప్రాజెక్ట్స్ సైన్ చేసారు. పైగా సీక్వెల్‌లో ఎలాంటి కథ చెప్తారనేది కూడా ఆసక్తికరమే. మొత్తానికి ట్రిపుల్ ఆర్ సీక్వెల్ అనౌన్స్ చేసినంత ఈజీ అయితే కాదు.