
ఇటీవల ఎయిటీస్ తారలంతా ఒక్క చోట చేరి సందడి చేసిన సంగతి తెలిసిందే. ముంబై వేదికగా పలువురు నటీనటులందరూ గ్రాండ్‌గా గెట్ టు గెదర్ పార్టీ ఏర్పాటు చేసుకున్నారు.

స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేశ్, అనిల్ కపూర్, అర్జున్‌తోపాటు నరేశ్, అనుపమ్ ఖేర్, జాకీ ష్రాఫ్, భానుచందర్, భాగ్యరాజ్, శరత్ కుమార్, శోభన, రాధ, రేవతి, ఊర్మిళ, సుహాసిని, సుమలత, రమ్యకృష్ణ, రాజ్‌కుమార్ సేతుపతి, ఖుష్బూ సుందర్ పాటు పలువురు నటీనటులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు.

ఈ స్టార్ పార్టీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈవెంట్‌కు సంబంధించిన మరిన్ని స్టిల్స్‌ను నటి మధుబాల ట్విటర్‌లో పోస్ట్ చేసింది.

ఈ ఫొటోల్లో మెగాస్టార్ చిరంజీవి, రమ్యకృష్ణ ఎంతో హుషారుగా డ్యాన్స్ చేస్తూ కనిపించారు. వీరితో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కూడా కాలు కదపడం విశేషం. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా చిరు, రమ్య ఇద్దరు కూడా స్టైలిష్ కాస్ట్యూమ్స్ ధరించి డ్యాన్స్ చేస్తోన్న ఫొటోలు ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటున్నాయి.

రమ్యకృష్ణ, చిరంజీవి కాంబినేషన్‌లో చాలా సినిమాలు వచ్చాయని తెలిసిందే. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్న స్టిల్ ను చూసి మూవీ లవర్స్ ఫిదా అవుతున్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. చిరు ప్రస్తుతం వాల్తేరు వీరయ్య తో పాటు భోళా శంకర్ సినిమాల్లో నటిస్తున్నారు. ఇక రమ్యకృష్ణ చాలా ఏళ్ల విరామం తరువాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి జైలర్ లో ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.