రేఖ వయసు 68కి చేరుకుంది. రేఖ ఇప్పటికీ దివి నుంచి భువికి దిగివచ్చిన దేవ కన్యలా అనిపిస్తుంది. ఇప్పటికీ అపురూప లావణ్యంతో కుర్రకారుకి కలకల సుందరిగా మారింది.
ఒకప్పుడు బాలీవుడ్‌ని శాసించింది. తన లుక్స్‌తో పాటు అసాధారణ నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంది. అయితే ప్రేక్షకులు రేఖను ఎప్పుడూ చీరలోనే చూస్తారు.
ఆన్‌స్క్రీన్ అయినా, ఆఫ్‌స్క్రీన్ అయినా రేఖ ఎప్పుడూ చీరలోనే కనిపిస్తూనే ఉంది. వాస్తవానికి రేఖ ఎప్పుడూ చీర ధరించడం వెనుక మరో కథ కూడా ఉంది. ఈ ప్రశ్నకు ఒకసారి అవార్డు షో వేదికపై రేఖ సమాధానమిచ్చింది.
చీర కట్టుకోవడం అంటే తన తల్లిని గౌరవించడం. తల్లి వారసత్వాన్ని గౌరవించడం, తన మూలాలను గౌరవించడమని సమాధానం ఇచ్చింది.
రేఖ ఎంత పాత దుస్తులు ధరించినా స్టైల్‌లో భాగమని.. అందమైన చీరను ధరిస్తే ఏ ట్రెండీ ఫ్యాషన్ అయినా చీర దానిని బీట్ చేస్తుందని చెప్పింది.
చీర కట్టుకుంటే తన తల్లిని చేతితో తాకిన భావన ఉంటుందని చెప్పింది. ఈ చీరతో తన తల్లి బతికినట్లు ఫీల్ అవుతానని చెప్పింది. రేఖ ఎక్కువగా కంజీవరం చీరల్లో ధరించి ఎక్కువగా కనిపిస్తుంది.
ఈ చీరతో తన ప్రేమ వెల్లడిస్తుంది. తాను చీర కట్టుకుంటే అమ్మ తనను కౌగిలించుకున్నట్టు అనిపిస్తుందని చీర తన తల్లి కోసమని చెప్పింది.
రేఖ చీరల సేకరణ గురించి చెప్పాలంటే ఒక్క మాట సరిపోదు. ఆమె వద్ద అందమైన రంగులతో అనేక రకాల చీరలున్నాయి. ఆమె వార్డ్ రోబ్ నిండా రకరకాల చీరలు.. ఇంద్ర ధనుస్సుని తలపిస్తాయి. అభిమానులే కాదు, ఫ్యాషన్ డిజైనర్లు కూడా ఆమె చీరలను స్ఫూర్తిగా తీసుకుంటూ సరికొత్త అందాలను సృష్టిస్తారు.