
ప్రస్తుతం సోషల్ మీడియాలో హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రేర్ ఫోటో తెగ వైరలవుతుంది. అందులో టీనేజ్ వయసులో అసలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా కనిపిస్తుంది పాయల్. ఆర్ఎక్స్ 100 సినిమాతో తెలుగు తెరకు పరిచయమై తొలి సినిమాతోనే విలనిజం చూపించింది పాయల్.

తొలి చిత్రంతో ఈ బ్యూటీ నటనకు విమర్శకులే ఆశ్చర్యపోయారు. దీంతో ఫస్ట్ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రాలేదు. ఆర్ఎక్స్ 100 తర్వాత పలు చిత్రాల్లో నటించిన పాయల్.. ఇప్పుడు ఓటీటీలో సత్తా చాటుతుంది.

ఇటీవలే మంగళవారం మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ సినిమాకు మంచి రివ్యూస్ వచ్చాయి. అలాగే ఓటీటీలో త్రీ రోజేస్ వెబ్ సిరీస్ ద్వారా అలరించింది. ప్రస్తుతం పాయల్ లేటేస్ట్ క్రేజీ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బ్లాక్ డ్రెస్ లో అచ్చం ప్రినెస్స్ మాదిరిగా కనిపిస్తుంది.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం పాయల్ రక్షణ సినిమాలో నటిస్తుంది. క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 7 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే మంగళవారం సినిమాతో ఛాలెంజింగ్ రోల్ సైతం చెయగలదని నిరూపించింది.

ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు పాయల్ రాజ్ పుత్ చేసిన సినిమాలకు ఇది పూర్తిగా భిన్నమైన సినిమా అని తెలుస్తోంది. సీట్ ఎడ్జ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్లతో సినిమా ఆద్యంతం కట్టిపడేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మొదటి సారి పోలీస్ ఆఫీసర్ గా కనిపించనుంది.