
సినీరంగంలో హీరోయిన్లుగా ఓ వెలుగు వెలగాలంటే అందం, అభినయంతోపాటు కాసింత అదృష్టం కూడా ఉండాలి. పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మడు.. ఇప్పుడిప్పుడే తెలుగులో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అయ్యింది. ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రెండు సినిమాల్లో నటించింది. అయితే అందులో ఒకటి హిట్టు, మరొకటి ఫ్లాప్ అయ్యింది.

ఈ అమ్మడు మరెవరో కాదండి.. హీరోయిన్ ఆషికా రంగనాథ్. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ.. నందమూరి కళ్యాణ్ రామ్ సరసన అమిగోస్ చిత్రంలో నటించింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. కానీ అందం, అభినయంతో ఈ ముద్దుగుమ్మ మంచి మార్కులు కొట్టేసింది.

అమిగోస్ తర్వాత ఆషికాకు అంతగా అవకాశాలు రాలేదు. ఇటీవలే అక్కినేని నాగార్జున సరసన నా సామిరంగ సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. కానీ హిట్టుకొట్టినప్పటికీ ఈ బ్యూటీకి ఆశించిన స్థాయిలో ఆఫర్స్ రాలేదు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న విశ్వంభర చిత్రంలో నటిస్తుంది.

ఇందులో మెయిన్ హీరోయిన్ రోల్ త్రిష నటిస్తుండగా.. సెకండ్ కథానాయికగా ఆషిక కనిపించనుంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆకట్టుకుంది. మరోవైపు సోషల్ మీడియాలో నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. బెంగుళూరుకు చెందిన ఆషికా.. 2014లో మిస్ ఫ్రెష్ ఫేస్ అనే అందాల పోటీలో రన్నరప్ గా నిలిచింది.

2016 నుంచి సినిమాల్లో యాక్టివ్ గా ఉన్న ఆషిక.. కన్నడలో శివరాజ్ కుమార్, సుదీప్, పునీత్ రాజ్ కుమార్, వంటి స్టార్ హీరోల చిత్రాల్లో నటించి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో తనదైన ముద్ర వేసేందుకు రెడీ అవుతుంది. తాజాగా ఈ అమ్మడు చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.