
ప్రస్తుతం ఓ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదిచుకుంది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా.. ? ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.

ఆమె మరెవరో కాదండి. బాలీవుడ్ బ్యూటీ కృతి ఖర్బందా. దాదాపు తొమ్మిదేళ్లుగా సినిమా ప్రపంచంలో దూసుకుపోతుంది. కానీ ఆమె నటించిన చిత్రాల్లో 7 సినిమాలు అట్టర్ ప్లాప్ అయ్యాయి. తెలుగు, కన్నడ, హిందీ భాషలలో పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. హిందీ కంటే ముందే తెలుగులో తనకు గుర్తింపు తెచ్చుకుంది.

పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించింది. అలాగే రామ్ పోతినేనితో ఒంగోలు గిత్త చిత్రంలో నటించింది కృతి. ఇవే కాకుండా తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన ఈ ఢిల్లీ బ్యూటీ.. హిందీలో ఇమ్రాన్ హష్మీ సరసన రాజ్ రీబూట్ సినిమాతో బాలీవుడ్ తెరంగేట్రం చేసింది. ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది.

హిందీతోపాటు దక్షిణాది భాషలలోనూ వరుస సినిమాల్లో నటించింది. అందం, అభినయంతో మంచి మార్కులు కొట్టేసింది. కానీ ఆశించిన స్థాయిలో సరైన బ్రేక్ మాత్రం అందుకోలేకపోయింది. ట్రెడిషనల్ అయినా.. గ్లామర్ రోల్స్ అయినా తనదైన నటనతో కట్టిపడేసింది. ఇప్పుడు ఈ బ్యూటీ బ్రేక్ కోసం చూస్తుంది.

ఈ అందాల ముద్దుగుమ్మ హిందీలో వరుస సినిమాలు చేస్తున్న సమయంలో తన తోటి నటుడు పుల్కిత్ సామ్రాట్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కొన్నాళ్లుపాటు సినిమాలకు దూరంగా ఉన్న కృతి.. ఇప్పుడు అవకాశాల కోసం వెయిట్ చేస్తుంది. అటు సోషల్ మీడియాలోనూ రోజుకో పోస్ట్ చేస్తూ సందడి చేస్తుంది.