
సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత చాలా మంది క్రేజ్ తెచ్చుకుంటూ ఉంటారు. చిన్న చిన్న పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకొని ఆ తర్వాత హీరోయిన్స్ గా మారి ఫ్యాన్స్ ను పెంచుకున్నవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ బ్యూటీ అలా కాదు.

సినిమాల్లోకి రాక ముందే ఓ ఊపు ఊపేసింది. తన అందంతో కుర్రాళ్లను కట్టిపడేసింది ఆమె సుప్రిత. ప్రముఖ నటి , క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖావాణి కూతురు ఈ అమ్మడు. చాలా మందికి ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

సోషల్ మీడియా ద్వారా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తల్లి సురేఖతో కలిసి సుప్రిత క్రేజీ వీడియోలు, ఆకట్టుకునే ఫోటో షూట్స్ చేసి నెటిజన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ భామ సినిమాల్లోకి రానుంది. హీరోయిన్ గా ఇటీవలే ఓ సినిమా మొదలుపెట్టింది.

సోషల్ మీడియాలో సుప్రిత ఫోటోలకు, వీడియోలకు మంచి క్రేజ్ ఉంది. అందాలు ఆరబోస్తూ కుర్రాళ్లను ఆకట్టుకుంటోంది ఈ వయ్యారి భామ. అందమైన ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట సెగలు రేపుతోంది.

ఇక సీరియల్ నటుడు అమర్ దీప్ హీరోగా సుప్రిత హీరోయిన్ గా ఇటీవలే ఓ సినిమా మొదలైంది. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. సోషల్ మీడియాతోనే ఇంత క్రేజ్ తెచ్చుకున్న ఈ అమ్మడు సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.