Tollywood: అందానికి ప్రతిరూపం.. నటనకు మరో రూపం.. తెలుగువారి మనసు గెలిచిన హీరోయిన్..

Updated on: Feb 10, 2025 | 10:20 AM

సోషల్ మీడియా ప్రపంచంలో ఇప్పుడు ఓ అమ్మాయి ఫోటో అందరిని కట్టిపడేస్తుంది. అందమైన రూపంతో చీరకట్టులో నెటిజన్లను ముగ్దులను చేస్తుంది. ఆమె ఒకప్పుడు దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోయిన్. అందం, అభినయంతో తెలుగు వారి మనసులను గెలిచిన ముద్దుగుమ్మ. ఇంతకీ ఆమె ఎవరంటే..

1 / 5
ఒకప్పుడు దక్షిణాదిలో టాప్ హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఆమె తెలుగు ప్రేక్షకులకు ఇష్టమైన హీరోయిన్. గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ సంప్రదాయానికి పట్టుచీర కట్టినట్లుగా ఉంటుంది.

2 / 5
 ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ స్నేహ.  2000లో ఇంగనే ఒరు నీలబక్షి అనే మలయాళ సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తమిళంలో మాధవన్ సరసన ఎన్నవలే అనే చిత్రంలో నటించింది. తర్వాత అనేక చిత్రాల్లో నటించింది.

3 / 5
 మ్యాచో స్టార్ గోపిచంద్ నటించిన తొలివలపు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యింది స్నేహ. ఆ తర్వాత తరుణ్ సరసన ప్రియమైన నీకు సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో శ్రీరామదాసు, రాధాగోపాలం, సంక్రాంతి వంటి హిట్ చిత్రాల్లో నటించింది.

4 / 5
ఆ తర్వాత కెరీర్ మంచి ఫాంలో ఉండగానే.. తమిళ్ హీరో ప్రసన్నను వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి 2012లో జరిగింది. వివాహం తర్వాత సినిమాలకు దూరంగా ఉండిపోయింది స్నేహ. ఈ దంపతులకు బాబు, పాప ఉన్నారు.

5 / 5
చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది స్నేహ. ఇప్పుడిప్పుడే స్టార్ హీరోల చిత్రాల్లో వదినగా, అక్క పాత్రలలో నటిస్తుంది. అలాగే కొన్ని రోజుల క్రితం స్నేహాలయం పేరుతో చీరల బిజినెస్ స్టార్ట్ చేసింది.