
సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ వయ్యారి.

ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగులో ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగార్జున, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ.

అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ గా వరుస హిట్లతో దూసుకుపోయిన రకుల్.. కొన్నాళ్లుగా సైలెంట్ అయ్యింది. చివరగా ఆమె అయలాన్, భారతీయుడు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం హిందీలో వరుస సినిమాలు చేస్తుంది.

ఇటీవలే తన ప్రియుడు నిర్మాత జాకీ భగ్నానితో ఏడడుగులు వేసింది రకుల్. పెళ్లి తర్వాత కూడా ఇండస్ట్రీలో సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంటుంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రావడం లేదు.

రకుల్ ప్రీత్ సింగ్ నేషనల్ గోల్ఫ్ ప్లేయర్ కూడా. దక్షిణాదిలో అతి తక్కువ సమయంలో స్టార్ డమ్ సంపాదించుకున్న రకుల్.. ఆ తర్వాత పలు వివాదాల్లోనూ చిక్కుకున్న సంగతి తెలిసిందే.