AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie : థియేటర్లలో రూ.6000 కోట్ల కలెక్షన్స్.. ఓటీటీలోకి వస్తున్న బ్లాక్ బస్టర్ హిట్ మూవీ..

ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న సినిమా మాత్రం థియేటర్లలో దాదాపు రూ.6000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ.. ? ఏ ఓటీటీలో సందడి చేయబోతుంది అనే విషయాలు తెలుసుకుందామా.

Rajitha Chanti
|

Updated on: Jul 02, 2026 | 12:35 PM

Share
హాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టించిన సైన్స్ ఫిక్షన్ స్పేస్ డ్రామా ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’ (Project Hail Mary) ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ఈ మూవీ థియేటర్లలో భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్ తేదీని అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా జులై 3 నుంచి స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో చూడలేకపోయిన సినిమా లవర్స్, ముఖ్యంగా సైన్స్ ఫిక్షన్ అభిమానులకు ఇది ఒక గొప్ప గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.

1 / 5
ప్రముఖ హాలీవుడ్ స్టార్ హీరో ర్యాన్ గాస్లింగ్ (Ryan Gosling) ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 6,000 కోట్లకు (సుమారు $683 మిలియన్లు) పైగా కలెక్షన్స్ సాధించి ట్రెండ్ క్రియేట్ చేసింది. ‘ది మార్షియన్’ నవల రచయిత ఆండీ వీర్ రాసిన బెస్ట్ సెల్లింగ్ బుక్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ దర్శకులు ఫిల్ లార్డ్, క్రిస్టోఫర్ మిల్లర్ అద్భుతమైన విజువల్స్‌తో ఈ సినిమాను వెండితెరపై ఆవిష్కరించారు.

2 / 5
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. భూమికి ఒక ఊహించని ముప్పు (సూర్యుడి శక్తిని క్షీణింపజేసే సూక్ష్మజీవులు - ఆస్ట్రోఫేజ్) ఏర్పడుతుంది. దీనివల్ల మానవాళి మనుగడే ప్రమాదంలో పడుతుంది. ఈ విపత్తు నుంచి ప్రపంచాన్ని రక్షించే ఒకే ఒక్క మిషన్ ‘ప్రాజెక్ట్ హెయిల్ మేరీ’. సైన్స్ టీచర్ అయిన రైలాండ్ గ్రేస్ (ర్యాన్ గాస్లింగ్) ఒక అంతరిక్ష నౌకలో ఒంటరిగా కళ్లు తెరుస్తాడు. అయితే, అతనికి గతం గుర్తుండదు. తాను ఎవరు? అక్కడికి ఎలా వచ్చాడు? అనే విషయాలు నెమ్మదిగా గుర్తొస్తాయి.

3 / 5
తాను ఒంటరిగా ఉన్నానని భావిస్తున్న సమయంలో, టౌ సెటి (Tau Ceti) గ్రహానికి చెందిన ‘రాకీ’ అనే వింత గ్రహాంతరవాసి (Alien) అతనికి పరిచయమవుతుంది. ఆ ఏలియన్ జాతి కూడా అదే సమస్యను ఎదుర్కొంటూ ఉంటుంది. ఈ ఇద్దరూ కలిసి ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు? ఒకరి భాషను మరొకరు నేర్చుకుంటూ, తమ గ్రహాలను రక్షించుకోవడానికి ఎలాంటి సాహసాలు చేశారు? అనేదే ఈ చిత్రంలోని అసలైన క్లైమాక్స్.

4 / 5
ఈ విజువల్ వండర్ జులై 3 (శుక్రవారం) నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే యూట్యూబ్‌లో రెంటల్ పద్ధతిలో అందుబాటులో ఉన్నప్పటికీ, ప్రైమ్ సబ్‌స్క్రైబర్లకు ఇది నేరుగా ఉచితంగా అందుబాటులోకి రానుండటంతో భారీ వ్యూస్‌ రావడం ఖాయంగా కనిపిస్తోంది. ర్యాన్ గాస్లింగ్ నటన, గ్రేగ్ ఫ్రేజర్ అందించిన అద్భుతమైన సినిమాటోగ్రఫీ, డానియల్ పెంబర్టన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాను ఒక మాస్టర్‌పీస్‌గా నిలిపాయి.

5 / 5
Follow Us
మీ ఇంట్లో తులసి మొక్క ఉందా..? అయితే, తప్పులు అస్సలు చేయొద్దు..

శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా స్కూళ్ళు, కాలేజీల బంద్.. ఎందుకంటే?

ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
ఆ హీరోయిన్ షూటింగ్ నుంచి పారిపోయింది..
రేషన్ కార్డు నెంబర్ మర్చిపోయారా..? సింపుల్‌గా ఇలా తెలుసుకోండి..

'టాక్సిక్' లో రెచ్చిపోయి నటించిన కియారా.. రెమ్యునరేషన్ ఎంతంటే?

పర్సెంటేజ్ పంచాయతీ మళ్లీ మొదటికొచ్చిందా..?

జట్టులో మార్పులు చేయాల్సి వస్తే మొదట సంజూనే టార్గెట్ చేస్తారా?

రోజూ ఉదయాన్నే తింటే.. 150 ఏళ్లు బలంగా ఉంటారు! తాతల నాటి సీక్రెట్‌

ఉదయాన్నే పొలానికి వెళ్లిన రైతు.. తచ్చాడుతూ కనిపించిన శ్వేతనాగు

ఈ ఫొటోలో ఉన్న ఇద్దరూ.. తెలుగులో క్రేజీ దర్శకులు..