
Bhumi Pednekar: నా సక్సెస్ క్రెడిట్ అంతా నాది మాత్రమే అంటున్నారు బాలీవుడ్ బ్యూటీ భూమీ పడ్నేకర్. సిల్వర్ స్క్రీన్ జర్నీలో తనకు ఎవరూ సాయం చేయలేదన్న భూమీ...

తను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. అందుకే తన జర్నీ చూసి తానే గర్వంగా ఫీల్ అవుతా అంటున్నారు ఈ బోల్డ్ బ్యూటీ.

ఏ హీరోయిన్ అయినా గ్లామర్ రోల్స్‌తో మొదలు పెట్టి పర్ఫామెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్ల వైపు వెళ్తారు. కానీ బీటౌన్ బ్యూటీ భూమీ పడ్నేకర్ మాత్రం తన కెరీర్‌ను డిఫరెంట్‌గా ప్లాన్ చేసుకున్నారు.

దమ్ లగాకే హైషా సినిమాతో సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తరువాత గ్లామర్ టర్న్ తీసుకొని సూపర్ సక్సెస్ అయ్యారు.ప్రజెంట్ బాలీవుడ్ మూవీస్‌లో ఫుల్ బిజీగా ఉన్న ఈ భామ... కమర్షియల్స్‌తోనూ సత్తా చాటుతున్నారు.

ఈ సక్సెస్ తన కష్టం వల్లే అని గర్వంగా చెబుతున్నారీ బ్యూటీ. ఇండస్ట్రీలో గుర్తింపు రావాలంటే మంచి నటి అయితే సరిపోదు, సక్సెస్ కూడా ఇంపార్టెంటే అన్నది భూమీ పడ్నేకర్ వర్షన్.

తన సినిమాలు వరుసగా సక్సెస్ అయ్యాయి కాబట్టే ఇండస్ట్రీ తనను గుర్తు పెట్టుకుందని.. మొహమాటం లేకుండా కామెంట్ చేశారు భూమీ.

తన సక్సెస్ క్రెడిట్ కూడా పూర్తిగా తనదే అంటున్నారు భూమీ పడ్నేకర్. కథల ఎంపికలో తన డెసిషన్ ఎప్పుడు ఫెయిల్ కాలేదని.. అందుకే తన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయని గర్వంగా చెప్పారు.

అయితే భూమీ కామెంట్స్ మీద రియాక్షన్స్ కూడా డిఫరెంట్‌గానే ఉన్నాయి. కొంత మంది భూమీ కాన్పిడెన్స్‌ను అప్రిషియేట్ చేస్తుంటే... సక్సెస్ క్రెడిట్ అంత తనది మాత్రమే అనటం అస్సలు కరెక్ట్ కాదన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

Bhumi Pednekar: బోల్డ్ ఫొటోస్ తో ఆకట్టుకునే భూమి లేటెస్ట్ ఫొటోస్..

Bhumi Pednekar: బోల్డ్ ఫొటోస్ తో ఆకట్టుకునే భూమి లేటెస్ట్ ఫొటోస్..

Bhumi Pednekar: బోల్డ్ ఫొటోస్ తో ఆకట్టుకునే భూమి లేటెస్ట్ ఫొటోస్..