
స్టార్ హీరోల సినిమాలొస్తే.. ఒక్క టికెట్ ఇప్పించండ్రా బాబూ.. డబ్బులు ఎంతైనా పర్వాలేదు అంటుంటారు అభిమానులు. కానీ బాలీవుడ్‌లో మాత్రం పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఓ స్టార్ హీరో సినిమా విడుదలైతే కనీసం ఓపెనింగ్స్ లేవు.

ఓ డెబ్యూ హీరోకు రేంజ్‌లో కూడా అక్షయ్ పెర్ఫామ్ చేయలేకపోవటం.. దారుణం అంటున్నారు విశ్లేషకులు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సాలిడ్ హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది.

కొద్ది రోజులుగా అక్షయ్ చేసిన సినిమాలేవి ఆడియన్స్‌ను మెప్పించలేకపోతున్నాయి. కొన్ని సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా.. వసూళ్లు పరంగా మాత్రం నిరాశపరుస్తున్నాయి.

నార్త్‌లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం దర్శక నిర్మాతలకు తలకు మించిన భారంగా మారింది. ఓ వైపు కల్కి సినిమాకు 17 రోజుల తర్వాత కూడా బుకింగ్స్ అదిరిపోతుంటే.. జులై 12న విడుదలైన అక్షయ్ సినిమాను కనీసం పట్టించుకోవట్లేదు ప్రేక్షకులు.

దాంతో పివిఆర్ ఐనాక్స్ సంస్థలు సర్‌ఫిరా కలెక్షన్లు పెంచడానికి ఫ్రీ మార్గాన్ని ఎంచుకున్నాయి. సర్‌ఫిరా సినిమాకు వస్తే.. ఒక టికెట్‌పై రెండు సమోసాలతో పాటు ఒక టీ ఉచితంగా ఇస్తామని ప్రకటించాయి పివిఆర్ ఐనాక్స్ సంస్థలు.

దానికి కొన్ని కండీషన్స్ ఉన్నాయి. అయితే ఎంత కండీషన్స్ ఉన్నా.. మల్టీప్లెక్స్‌లలో ఓ టీ, 2 సమోసా అంటే వందల్లో మ్యాటర్ కదా.. అదైనా ఫ్రీగా ఇస్తున్నారంటే చిన్న విషయం కాదు. ఎంతైనా అక్షయ్ లాంటి హీరో సినిమాకు ఈ దుస్థితి రావడం నిజంగా దారుణమైన విషయమే.