Basha Shek |
Mar 29, 2023 | 5:53 PM
90వ దశకంలో బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది రవీనా టాండన్. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్, స్పెషల్ రోల్స్‌తో సందడి చేస్తోంది.
కన్నడ రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ ఛాప్టర్ 2 సినిమా రవీనాటాండన్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇందులో ఆమె పోషించిన రమీకా సేన్ పాత్రకు పలువురి ప్రశంసలు దక్కాయి.
అడపాదడపా మాత్రమే సినిమాల్లో నటిస్తోన్న రవీనా సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటోంది. నిత్యం తన గ్లామరస్ అండ్ ఫ్యాషనబుల్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది.
ఇందులో చమ్కీలతో కూడిన ఆకుపచ్చ గౌనులో ఎంతో అందంగా కనిపించింద రవీనా. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 48 ఏళ్ల వయసులోనూ రవీనా ఎంతో అందంగా ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే.. కేజీఎఫ్ 2 తర్వాత Ghudchadi అనే సినిమాలో నటిస్తోంది రవీనా. ఇందులో సంజయ్‌దత్ కీలక పాత్రలో కనిపించనున్నారు.