
మలైకా అరోరా.. ఈ బాలీవుడ్ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.నటిగా కంటే ఐటెం సాంగ్స్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ.

అంతే కాదు బాలీవుడ్ లో తనకన్నా చాలా చిన్నవాడైన అర్జున్ కపూర్ తో రిలెక్షన్ లో ఉంది ఈ భామ. ఈ ఇద్దరు చట్టపట్టాలేసుకుంటూ తిరుగుతూ చాలా మీడియా కంటపడ్డారు.

మలైకా అరోరా, అర్జున్ కపూర్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వాతలు ఎప్పటికప్పుడు బాలీవుడ్ లో చక్కర్లు కొడుతూనే ఉంటాయి. కానీ ఇంతవరకు ఆ వార్తలపై ఎవ్వరు స్పందించలేదు.

ఇక ఈ భామ చేతిలో ఇప్పుడు సినిమా ఆఫర్స్ లేవు.. కానీ మలైకా బాలీవుడ్ లో ఎప్పుడు హాట్ టాపికే. సోషల్ మీడియాలో ఆమె షేర్ చేసేఫొటోలు నెటిజన్స్ ను ఆకట్టుకుంటాయి.

నాలుగు పదుల వయసులోనూ ఫిట్ నెస్ తో ఉంటూ అలాగే అందాలు ఆరబోస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తూ ఉంటుంది. నిత్యం తన గ్లామర్ ఫోటోలను నెట్టింట వదులుతూ ఉంటుంది మలైకా