
బిగ్‌బాస్ సీజన్ 4తో తెలుగు ప్రేక్షకులను తనవైపు తిప్పుకుందీ అందాల తార దివి వైద్య. ‘మహర్షి’ సినిమాలో ఓ చిన్న పాత్రలో కనిపించిన నటి దివి వైద్య ఇప్పుడు ఏకంగా లీడ్ రోల్‌లో నటిస్తోంది.

తనదైన అందమైన రూపం, ఆకట్టుకునే కళ్లతో కుర్రకారును ఫిదా చేసిన ఈ చిన్నది వరుస ఆఫర్లను దక్కించుకుంటూ దూసుకుపోతోంది.

ఇక సోషల్ మీడియాలోనూ ఈ బ్యూటీ క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మడికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 8 లక్షలు దాటేసింది.

ఓవైపు సినిమాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉండే ఈ చిన్నది తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా కొన్ని ఫోటోలు పోస్ట్ చేసింది.

నీలి రంగు లంగా ఓణీలో మత్తెక్కించే కంటి చూపుతో కుర్రకారు గుండెల్లో గిలిగింతలు పెడుతోందీ చిన్నది. ఇక ఈ ఫోటోలతో పాటు ఈ చిన్నది పోస్ట్ చేసిన క్యాప్షన్‌లు కూడా ఆకట్టుకుంటున్నాయి.