
Dబిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది దివి. బిగ్బాస్ సీజన్ 4లో కంటెస్టెంట్ గా పాల్గొంది ఈ అమ్మడు. తన గేమ్ తో పాటు గ్లామర్ తోనూ ఆకట్టుకుంది ఈ చిన్నది.

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి.. 2019లో వచ్చిన మహేష్ బాబు మహర్షి సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది.

ఆతర్వాత కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించి మెప్పించింది. ఇక బిగ్ బాస్ షో ద్వారా ప్రేక్షకులను మెప్పించిన ఈ చిన్నదానికి మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు.

గాడ్ ఫాదర్ సినిమాలో చిన్న పాత్రలో నటించింది దివి. ఆతర్వాత ఈ అమ్మడికి ఆఫర్స్ కరువైయ్యాయి. దాంతో సోషల్ మీడియాలో గడిపేస్తోంది.

నిత్యం తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది దివి. ఈ క్రమంలో తాజాగా కొన్ని ఫోటోలు షేర్ చేసింది దివి.. చిన్న గౌనులో అదిరిపోయే ఫోజులిచ్చింది దివి.