Divi Vadthya: పల్లెటూరి పిల్లలా అందాలతో ఆకట్టుకున్న బిగ్ బాస్ బ్యూటీ దివి..
బిగ్ బాస్ పుణ్యమా అని పాపులారిటీ తెచ్చుకున్న భామల్లో దివి ఒకరు. బిగ్ బాస్ గేమ్ షోకు వెళ్లక ముందు ఈ అమ్మడు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించింది. ముఖ్యంగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో నటించింది దివి. ఇక బిగ్ బాస్ లో తనదైన ఆటతో ఆకట్టుకుంది. అలాగే గ్లామర్ షోతోనూ ప్రేక్షకులను తనవైపు తిప్పుకుంది దివి. ఈ అమ్మడు తన అందంతో కుర్రకారును కవ్విస్తుంది.