
గ్రేస్ ఫుల్ డ్యాన్స్, ఎనర్జిటిక్ మూమెంట్స్ అండ్ స్టెప్స్ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాస్టర్ అలియాస్ ఆట సందీప్. ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ షో ‘ఆట’ మొదటి సీజన్‌లో విన్నర్‌గా నిలిచిన సందీప్ అప్పటి నుంచి తన పేరును ఆట సందీప్‌గా మార్చుకున్నాడు.

ఇక గతేడాది బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ఎంట్రీ ఇచ్చాడీ డ్యాన్స్ మాస్టర్. తన ఆటతీరు, మాటతీరుతో బుల్లితెర అభిమానులను అలరించాడు.

గ్రాండ్ ఫినాలేకు చేరుకోలేకపోయినా బిగ్ బాస్ షోతో బాగానే క్రేజ్ సంపాదించుకున్నాడు సందీప్ మాస్టర్. ఇదిలా ఉంటే తాజాగా తన భార్య జ్యోతి రాజ్ తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడీ డ్యాన్స్ మాస్టర్.

తమ 10వ వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కాలి నడకన శ్రీవారి దర్శనానికి వెళ్లారు సందీప్ మాస్టర్- జ్యోతి రాజ్ దంపతులు.

దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసుకోగా అవి కాస్తా వైరల్ గా మారాయి. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు సందీప్ మాస్టర్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.