Priyanka Jain: బిగ్‌బాస్ ఫైనలిస్ట్‌గా నిలిచిన ఒకే అమ్మాయి.. ప్రియాంక జైన్ గురించి ఈ విషయాలు తెలుసా ?..
బిగ్‌బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. మొత్తం 19 మందితో మొదలైన ఈషోలో ఇప్పుడు కేవలం ఆరుగురు మాత్రమే మిగిలారు. అందులో ఫైనలిస్ట్‌గా అమ్మాయి ప్రియాంక జైన్. మౌనరాగం సీరియల్ లో తన నటన.. హవభావాలతోనే తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది ప్రియాంక. ఇందులో మాటలు రాని మూగ అమ్మాయిగా ప్రియాంక కనిపించి మంచి ఫేమ్ సంపాదించుకుంది. ఆ తర్వాత జానకి కలగలేదు సీరియల్ ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇటు తెలుగులో సీరియల్స్ చేస్తునే.. అటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది.