
సీనియర్ బ్యూటీ భూమిక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్ మొదలు పెట్టి వరుసగా సినిమాలు చేస్తోంది. ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది భూమిక.

టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన సినిమాలు చేసింది ఈ బ్యూటీ. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చింది.

అంతే కాదు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి సీనియర్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది ఈ అందాల భామ.

ఇక సోషల్ మీడియాలో భూమిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. అలాగే తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది.

భూమిక షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. క్యాజువల్ డ్రస్ లో చాలా క్యూట్ గా ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ చిన్నది.