Rajeev Rayala |
Apr 28, 2024 | 2:26 PM
భీమ్లానాయక్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది సంయుక్త మీనన్. పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా నటించిన ఈ సినిమాలో రానాకు జోడిగా నటించి మెప్పించింది సంయుక్త మీనన్.
‘తీవండి’ అనే మలయాళ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ పలు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత భీమ్లానాయక్ సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది.
ఆ తర్వాత కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార సినిమాలో నటించింది ఈ సినిమా కూడా సూపర్ హిట్ అందుకుంది. అలాగే సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన విరూపాక్ష సినిమాతో మరో హిట్ అందుకుంది.
ఇంకా హ్యాట్రిక్ హిట్ అందుకున్న ఈ బ్యూటీ తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి నటించింది. సార్ సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాకూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత డెవిల్ అనే సినిమా చేసింది. ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది సినిమాలకు గ్యాప్ ఇచ్చింది. ఆచితూచి సినిమాలు చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆధ్యాత్మిక బాటలోకి అడుగు పెట్టింది. సంయుక్త ఓ పురాతన ఆలయాన్ని సందర్శించింది. అక్కడ దిగిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది .