హీరోయిన్స్‏గా గ్లామర్ నే కాదు విలన్స్‏గా నెగిటివ్ షెడ్స్ ను చూపించిన తారలు వీరే..

|

Feb 27, 2021 | 11:11 AM

కేవలం హీరోయిన్లుగా మాత్రమే కాకుండా తాము విలనిజాన్ని పండించగలమంటూ తమ సత్తాను చూపించారు కొంతమంది అందాల తారలు. వారెవరో చూసేద్దామా..

1 / 7
రమ్యకృష్ణ... దాదాపు అగ్రహీరోలందరి సరసన నటించింది.  అప్పట్లో టాప్ హీరోయిన్‏గా కోనసాగుతూనే రజినీ కాంత్, సౌందర్య హీరోహీరోయిన్లుగా నటించిన నరసింహ సినిమాలో పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటించి మెప్పించింది రమ్యకృష్ణ. ఇప్పటికీ నీలాంబరిగా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది.

2 / 7
సౌందర్య... మన ఇంటి సంప్రదాయపు ఆడపిల్లగా కనిపిస్తూ.. తన చిరునవ్వుతో ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది సౌందర్య. నంబర్ వన్ హీరోయిన్‏గా కొన్ని ఏళ్ళు టాలీవుడ్‏లోని అగ్రహీరోల సరసన నటించిన సౌందర్య.. అదే సమయంలో శ్రీకాంత్ హీరోగా నా మనసిస్తా రా సినిమాలో నెగిటివ్ షెడ్‏లో అలరించింది. కానీ ఎప్పుడు మంచితనంగా కనిపించే సౌందర్యను ప్రేక్షకులు అలా విలన్ పాత్రలో చూడలేకపోయారు.

3 / 7
త్రిష.. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లో చేస్తూ వచ్చిన త్రిష.. క్రమంగా టాప్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన ధర్మయోగి సినిమాలో మెయిన్ విలన్ పాత్రలో నటించింది.

4 / 7
సమంత... చక్కటి చిరునవ్వు, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో కుర్రకారును కట్టిపడేసింది సమంత. హీరోయిన్‏గా అలరిస్తూనే.. తమిళ స్టార్ విక్రమ్ హీరోగా వచ్చిన పత్తు ఎంద్రాకుల్లా సినిమాలో పవర్ ఫుల్ విలన్‏గా నటించింది.

5 / 7
రాశి.. అందమైన సంప్రదాయపు బుట్టబోమ్మలగా కనిపించే రాశి.. తనలోనూ నెగిటివ్ షేడ్ ఉందని నిరుపించుకుంది. మహేష్ బాబు నటించిన నిజం సినిమాలో గోపిచంద్ సరసన విలన్ పాత్రలో రాశి నటన అద్భుతం అని చెప్పుకోవచ్చు.

6 / 7
రీమాసేన్.. గ్లామర్ హీరోయిన్‏గానే కాకుండా ప్రతినాయిక పాత్రలోనూ మెప్పించింది రీమాసేన్.. కార్తీ యుగానికి ఒక్కడు సినిమాతోపాటు శింబు తెరకెక్కించిన వల్లభ సినిమాల్లో రీమాసేన్ నటనకు ప్రేక్షకులు ఫిదా కావాల్సిందే.

7 / 7
వరలక్ష్మీ శరత్ కుమార్... ప్రస్తుతం కోలివుడ్‏తోపాటు టాలీవుడ్‏లో ఫీమేల్ విలన్‏గా వరలక్ష్మీ శరత్ కుమార్ దూసుకుపోతుంది. ఇటీవల విడుదలైన రవితేజ క్రాక్ సినిమాలో జయమ్మగా నటించి మరోసారి తానేంటో నిరుపించుకుంది వరలక్ష్మీ.