
బ్యూటీ శ్రీముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ ముద్దుగుమ్మ సొంతం. పటాస్ కామెడీ షోతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటి, తర్వాత యాంకర్ గా వరసగా షోలు చేస్తూ ఫుల్ బిజీ అయిపోయింది.

సుమ తర్వాత యాంకర్ గా మంచి ఫేమ్ ఉన్న ముద్దుగుమ్మ అంటే శ్రీముఖినే. ఈ అమ్మడు చాలాషోలకు హోస్ట్ గా వ్యవహరిస్తుంది. అంతే కాకుండా పలు సినిమాల్లో కూడా నటిస్తూ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అంతే కాకుండా ఈ చిన్నది ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వరస ఫొటోషూట్ తో కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తుంది.

తాజాగా ఈ అందాల ముద్దుగుమ్మ తెలుపు రంగు డ్రెస్ లో అందంగా రెడీ అయ్యి, తన క్యూట్ లుక్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

దీంతో ఈ ఫొటోస్ చూసిన నెటిజన్స్, రంగు రంగుల గాజులతో అందంగా ముస్తాబై చూడ చక్కగా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు.