నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ త్వరలో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, నిర్మాతగా, చివరకు పొలిటికల్ లీడర్‌గానూ తనదైన ముద్రవేసిన ఆయన త్వరలో కథానాయకుడిగా అలరించేందుకు సిద్ధమయ్యాడు.
తమిళంలో ఘన విజయం సాధించిన క్రైమ్ థ్రిల్లర్ 'ఒత్త సెరుప్పు అళవు7'(సింగిల్ స్లిప్పర్ సైజ్-7) తెలుగు రీమేక్‌లో బండ్ల నటించనున్నారు. తమిళ్‌లో పార్తిబన్ స్వీయ దర్శకత్వంలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడమే కాకుండా పలు అవార్డులను సొంతం చేసుకుంది.
ఒకే ఒక క్యారెక్టర్‌తో సినిమాను తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు పార్తిబన్. కాగా ఈ సినిమాను హిందీలో అభిషేక్ బచ్చన్ రీమేక్ చేస్తుడటం గమనార్హం.
కాగా, తెలుగులో బండ్ల గణేశ్ ఈ క్యారెక్టర్ పోషించనున్నాడు. తెలుగు రీమేక్‌కు వెంకట్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నాడు. సెప్టెంబరు ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమా కోసం బండ్ల ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో బండ్ల గణేష్‌కు, ఆయన స్పీచ్‌లకు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి హీరోగా బండ్ల ఎంతమేర సక్సెస్ అవుతారో చూడాలి.