
1978 లో కిస్సా కుర్సీ కా అనే రాజకీయ నాటక చిత్రంతో తొలిసారిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దీని తర్వాత సురేఖ చాలా సినిమాల్లో పనిచేశారు. ఇది మాత్రమే కాదు 3 సార్లు సహాయ నటిగా జాతీయ అవార్డును అందుకుంది.

సురేఖా 1989 సంవత్సరంలో సంగీత నాటక్ అకాడమీ అవార్డును కూడా గెలుచుకుంది. బాలికా వధు (చిన్నారి పెళ్లి కూతురు) సీరియల్‌లోని కళ్యాణి దేవి పాత్ర ద్వారా సురేఖాకు ఎక్కువ పాపులారిటీ వచ్చింది.

బధాయ్ హో చిత్రంలో కూడా సురేఖ పాత్ర అందరికి నచ్చింది. ఈ చిత్రంలో ఆయుష్మాన్ ఖుర్రానా అమ్మమ్మ పాత్రలో సురేఖా నటించింది.

2019 సంవత్సరంలో హిందూస్తాన్ టైమ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు 10 నెలల క్రితం నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని, అప్పటినుంచి తాను కోలుకుంటున్నానని సురేఖా చెప్పారు.