
నందమూరి వారసుడి తెరంగేట్రానికి సంబంధంచి బిగ్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చిన మేకర్స్, ఆ తరువాత సైలెంట్ అయ్యారు. ఆ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. కంటెంట్ ఎలా ఉండబోతోంది. ఈ మూవీ విషయంలో బాలయ్య ఎంత వరకు ఇన్వాల్వ్ అవుతున్నారు అన్నది అప్‌డేట్స్ రాలేదు. తాజాగా ఈ విషయంలోనే ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో నందమూరి వారసుడి తెరంగేట్రం కన్ఫార్మ్ అయ్యింది. ఆల్రెడీ బిగ్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చిన మేకర్స్ త్వరలో ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు రెడీ అవుతున్నారు. బాలయ్య కూడా కొడుకు డెబ్యూ సినిమా విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.

ప్రజెంట్ డాకు మహారాజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్న బాలయ్య, నవంబర్ ఎండింగ్‌లోగా ఆ సినిమాను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. వన్స్ తన సినిమా షూటింగ్ పూర్తయితే కొడుకు డెబ్యూ మూవీ మీద దృష్టి పెట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ మొదటి వారంలోనే మోక్షజ్ఞ మూవీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు.

మోక్షజ్ఞ డెబ్యూ మూవీని రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రశాంత్ వర్మ మార్క్ ఫాంటసీ ఎలిమెంట్స్‌తో పాటు మోక్షూని లవర్‌బాయ్‌గా ప్రేక్షకులకు పరిచయం చేసే ఎలిమెంట్స్‌తో కథను సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాలో మరో సర్‌ప్రైజ్ కూడా ఉంటుందన్నది లేటెస్ట్ అప్‌డేట్.

డిసెంబర్ నుంచే రెగ్యలర్ షూటింగ్ జరగనుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో స్పెషల్ సెట్స్ వేస్తున్నారు.