
అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి.. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో హ్యాట్రిక్ విజయాలు సొంతం చేసుకున్నారు నందమూరి బాలకృష్ణ. ముఖ్యంగా దసరా పండగ కానుకగా రిలీజైన భగవంత్ కేసరి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. వంద కోట్లకు చేరువైంది.

అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్యతో పాటు శ్రీలీల, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్‌గా మెప్పించాడు.

భగవంత్ కేసరి సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో బాలయ్య తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచేశారని టాక్ వినిపిస్తోంది. బాబీ డైరెక్షన్‌లో తాను చేయబోయే సినిమా కోసం బాలకృష్ణ ఏకంగా రూ. 28 కోట్లకు పైగా రెమ్యునరేషన్‌ను తీసుకుంటున్నారట.

తన తాజా సినిమా భగవంత్ కేసరి కోసం బాలయ్య రూ.18 కోట్లు తీసుకున్నాడట. అయితే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తన పారితోషకాన్ని ఏకంగా రూ. 10 కోట్లు పెంచేశారట.

అంతకు ముందు వీరసింహా రెడ్డి కోసం రూ.14 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నారట బాలయ్య. అంటే సినిమా సినిమాకు తన పారితోషకాన్ని పెంచుకుంటూ పోతున్నారట బాలయ్య. ప్రస్తుతం ఆయన వాల్తేరు వీరయ్య ఫేమ్ బాబీ డైరెక్షన్‌లో ఓ మూవీ చేస్తున్నారు.