4 / 5
మనకు బాగా అలవాటైన ఆ మాట... మీకూ వినిపించిందా? యస్.. అదేనండీ నస్సబెల్లీ అంటూ... చిరు అండ్ గ్యాంగ్ స్టెప్పులేస్తూ యమాగా ఎంజాయ్ చేశారు కదా... పాపులర్ పదాల పట్టుబట్టు.. కుర్రకారు అటెన్షన్ పట్టు... అంటూ మెగాస్టార్ కూడా ట్రెండ్‌లో జాయిన్ అయ్యారు. గుంటూరు కారం చిత్రంలో కుర్చీమడతబెట్టి సాంగ్ వచ్చినప్పుడు జరిగిన రచ్చ చూడాలి. సోషల్ మీడియాలో వేరే రకంగా వైరల్ అయిన మాటను.. అలా ఎలా వాడేస్తారంటూ ఒకటే రచ్చ... అయితే చెప్పాల్సిన విషయాన్ని చెప్పదగినంతే తీసుకున్నామంటూ వాదనలకు ఫుల్‌స్టాప్ పెట్టేశారు మేకర్స్. కుర్చీ మడత పెట్టికి లైకులు, వ్యూస్ రికార్డు రేంజ్‌లో రావడం గమనార్హం.