
హీరోయిన్ అతుల్య రవి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో చెప్పక్కర్లేదు. నిత్యం లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటుంది ఈముద్దుగుమ్మ.

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోస్ వైరలవుతున్నాయి. అందులో పాల కడలిలోని అందాల రాకూమారిగా.. భూవికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తుంది అతుల్య.

1994 డిసెంబర్ 21న తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది అతుల్య. 2017లో కాదల్ కన్ కట్టుధే సినిమాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది ఈ తార.

ఆ తర్వాత తమిళంలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి అలరించింది. యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమాతె తెలుగు తెరకు పరిచయమైంది అతుల్య రవి.

కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దీంతో ఈ బ్యూటీకి తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. కానీ నెట్టింట మాత్రం ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్.