
కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన అమిగోస్ అనే సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ ఆషిక రంగనాథ్. తొలి సినిమాతోనే తన అందంతో అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ సినిమా విజయం సాదించపోయినా ఈ అమ్మడికి మంచి మార్కులు పడ్డాయి.

ఆతర్వాత కింగ్ నాగార్జునతో నా సామీరంగ సినిమాలో నటించింది. ఈ సినిమాలో తన నటనతో కట్టిపడేసింది ఆషిక రంగనాథ్. ఈ సినిమా ఓ మోస్తరు విజయం సాధించింది. ఆతర్వాత ఆషిక రంగనాథ్ కు ఆఫర్స్ పెరిగాయి.

ప్రస్తుతం ఈ అమ్మడు వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలోనే మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ , టీజర్ సినిమాపై అంచనాలను పెంచేయి. అలాగే రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమా పై భారీ హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో ఆషిక రంగనాథ్ గ్లామరస్ రోల్ లో కనిపించనుందని తెలుస్తుంది.

ఈ సినిమాపై ఆషిక రంగనాథ్ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాతో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కాగా సోషల్ మీడియాలోనూ ఈ చిన్నది క్రేజీ ఫోటోలను పంచుకుంటుంది.