
తన చూపుల సంద్రంలో పడి కొట్టుకుపోయే ఎన్నో హృదయాలు.. ఈ వయ్యారాల సోయగం ముందు అల్లాడిపోయే కుర్రాళ్లు హృదయాలు అనేట్లుగానే కనిపిస్తుంది ఆషికా రంగనాథ్. నల్లని చీరలో మరింత అందంగా మెరిసిపోతుంది ఈ కన్నడ భామ.

కన్నడ సినీ పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ సుందరి.. ఇప్పుడు తెలుగులో అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. నందమూరి హీరో కళ్యామ్ రామ్ సరసన అమిగోస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

ఫస్ట్ మూవీ ఆశించినంతంగా ఆకట్టుకోలేక పోయింది. కానీ అందం, అభినయంతో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఆషికా. ఆ తర్వాత కొన్నాళ్లపాటు సైలెంట్ అయిన ఈ బ్యూటీ.. ఈ ఏడాది నా సామిరంగ సినిమాతో అలరించింది.

అక్కినేని నాగార్జున నటించిన నా సామిరంగ సినిమాలో వరలక్ష్మీ పాత్రలో మరోసారి వెండితెరపై మాయ చేసింది. అందం, టాలెంట్ ఎంత ఉన్న ఈ బ్యూటీకి తెలుగులో మాత్రం అంతగా అవకాశాలు రావడం లేదు.

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పుటికప్పుడు లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన బ్లాక్ కలర్ శారీ ఫోటోస్ ఆకట్టుకుంటున్నాయి. ముద్ద మందారం సిగ్గు పడితే ఇంతందంగా ఉంటుందా అన్నట్లుగా కనిపిస్తుంది.