
కార్తికేయ 2, 18 పేజెస్, బటర్‌ఫ్లై సినిమాలంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుంది మలయాళీ ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్.

ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. అనుపమ నటించిన DJ టిల్లు సీక్వెల్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

సినిమాలో బిజీగా ఉండే అనుపమ తాజాగా ఆవకాయ పచ్చడి పెట్టింది. ఈ సందర్భంగా తన ఇంట్లో ఆవకాయ పచ్చడి పెడుతుండగా తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది.

ప్రస్తుతం అనుపమ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు 'అమ్మ.. ఆవకాయ.. అనుపమ.. ఎప్పటికి బోర్ కొట్టవు' అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

అనుపమ చేతిలో డీజే టిల్లు సీక్వెల్‌తో పాటు ఈగల్, సైరన్ వంటి క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.