
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అఆ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది అందాల భామ అనుపమ పరమేశ్వరన్ . ఆ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి మెప్పించింది అనుపమ.

ఆతర్వాత టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారిపోయింది. తెలుగులో యంగ్ హీరోలకు జోడీగా నటించి మెప్పించింది అనుపమ పరమేశ్వరన్.

తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ కేరళ కుట్టి. తెలుగులో అనుపమకు మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

ఇప్పటివరకు అనుపమ పరమేశ్వరన్ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చింది. కానీ ఇప్పుడు సినిమాకు అవసరం అనుకుంటే గ్లామర్ పాత్రలోనూ నటిస్తానంటుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ తాజాగా తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం డీజే టిల్లు 2 సినిమాలో సిద్దు జొన్నలగడ్డ లవర్ గా నటిస్తుంది అనుపమ.