
ఇండస్ట్రీలో అనుపమకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాను నటించిన సినిమాలే తక్కువే అయినా యూత్ లో మాత్రం మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. సోషల్ మీడియాలో ఈ అమ్మడి ఒక్క పోస్ట్ పెడితే చాలు, అది ట్రేండింగ్ లోకి రావాల్సిందే.

అనుపమ పరమేశ్వరన్‌కు తెలుగుతో పాటు తమిళ, మలయాళ భాషల్లో కూడా మంచి క్రేజ్ వుంది. ఈ భామ 'ప్రేమమ్' అనే సినిమాతో మలయాళ చిత్ర పరిశ్రమకు పరిచయమైంది. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన 'అ ఆ'లో అవకాశం వచ్చింది. ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి మెప్పించింది.

అనుపమ అతి తక్కువ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానులను సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను యాక్టివ్‌గా ఉంటూ ఎప్పుడు అభిమానులకు దగ్గరగా ఉంటుంది.

నిన్న మొన్నటి వరకు టాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన అనుపమ.. సడెన్‌గా రేసులో వెనకబడింది. ప్రస్తుతం సినిమాల్లో మెయిన్ హీరోయిన్ రోల్స్ కాకుండా క్యారెక్టర్స్ రోల్స్ చేస్తోన్న ఈ భామకు కార్తికేయ 2 సినిమా సక్సెస్‌తో మళ్లీ రేసులోకి వచ్చింది.

గత ఏడాది చివర్లో మళ్లీ నిఖిల్‌తో కలిసి నటించిన 18 పేజీస్ సినిమాకు కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో పాటు 2022 యేడాది చివరి హిట్‌గా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. అదే ఊపులో ‘టిల్లు స్వ్కేవర్’ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తోంది. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాలో ఇప్పటి వరకు చూడని అనుపమను చూస్తారని ట్వీట్ చేసింది.

ఇది ఇలా ఉంటే తాజాగా అనుపమ టాలీవుడ్ లో ఒక కొత్త ట్రెండ్ ని తీసుకొచ్చింది. ‘పద పద’ అనే ఒక ఆల్బమ్ సాంగ్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. డెన్నిస్ నార్టన్ ఈ సాంగ్ ని కంపోజ్ చేయగా చిన్మయి పాడగా ఈ సాంగ్ ని అనుపమతో అందంగా చిత్రీకరించారు.