
అనిఖా సురేంద్రన్.. ఈ పేరు చెబితే ప్రేక్షకులకు అంతగా తెలియకపోవచ్చు.. కానీ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రీల్ కూతురు అంటే మాత్రమే ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో అడియన్స్ కు దగ్గరయ్యింది అనిఖా సురేంద్రన్.

బాలనటిగా తమిళ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిఖా కేరళ అమ్మాయి. తమిళంతోపాటు మలయాళంలోనూ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది అనిఖా సురేంద్రన్. ఆ తర్వాత అజిత్ చిత్రంలో కనిపించింది.

విశ్వాసం సినిమాతో ఇటు తెలుగులోనూ అనిఖాకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో అజిత్ రీల్ కూతురిగా ప్రత్యేకమైన ఫాలోయింగ్ సంపాదించుకుంది అనిఖా సురేంద్రన్.

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించిన అనిఖా.. ఇప్పుడు హీరోయిన్ గా నటించేచందుకు అవకాశాల కోసం ఎదురుచూస్తుంది. ఇప్పటికే తెలుగులో బుట్టబొమ్మ సినిమాతో కథానాయికగా మారింది.

ఇక అటు సోషల్ మీడియాలోనూ అనిఖా ఫుల్ యాక్టివ్. ఇటీవల నిత్యం ఫోటోషూట్స్ చేస్తూ అద్భుతమైన ఫోటోలను తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.

తెలుపు రంగు కసవు పట్టు, మెరూన్ లెహాంగాలో మోడ్రన్ లుక్లో కట్టిపడేసింది అనిఖా. ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.