అనిక సురేంద్రన్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. వెండితెరపై అజిత్ రీల్ డాటర్ అంటే మాత్రం ఠక్కున గుర్తుపట్టేస్తారు. అంతగా తన నటనతో పాపులర్ అయ్యింది. అజిత్ కుమార్ నటించిన విశ్వాసం సినిమాతో అనిక బాలనటిగా గుర్తింపు సంపాదించుకుంది. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ సినిమా విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మన్నెయ్ ఐందాల్ చిత్రంలో బాలతారగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది అనిక. ఆ తర్వాత తమిళంలో నానుమ్ రౌడీ థాన్, విశ్వాసంతోపాటు మరికొన్ని చిత్రాల్లో నటించింది.