టాలీవుడ్ స్టార్ యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చేతినిండా టీవీషోస్, ప్రోగ్రామ్స్ తో బిజి బిజీగా ఉంటోందీ అందాల యాంకరమ్మ.
ఓవైపు స్టార్ యాంకర్ గా బుల్లితెర ఆడియెన్స్ ను అలరిస్తూన్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు సినిమాల్లోనూ మెరుస్తుంటుంది.
ప్రస్తుతం టీవీ షోలతో బిజీగా ఉంటోన్న శ్రీముఖి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. ఆదివారం (జనవరి 26) తిరుమలకు వెళ్లిన ఆమె వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించింది.
ఈ సందర్భంగా తన తిరుమల పర్యటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శ్రీముఖి.
దీంతో ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. నెటిజన్లు భిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కాగా సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ లో యాంకర్ శ్రీముఖి రామ లక్ష్మణ్ లను ఫిక్షనల్ క్యారెక్టర్ అనడం పై తీవ్ర దుమారం రేగింది. అయితే వెంటనే క్షమాఫణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.