
అందాల ముద్దుగుమ్మ శ్రీ ముఖి గురించి ఎంత చెప్పినా తక్కువే. అందం, అభినయం ఈ అమ్మడు సొంతం. తన వాక్ చాతుర్యం, గ్లామర్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకొని బుల్లితెరపై తన హవా కొనసాగిస్తుంది ఈ అందాల తార.

పటాస్ కామెడీ షోతో తెలుగు అభిమానులకు పరిచయం అయ్యింది ఈ బ్యూటీ. ఈ షోలో తన యాంకరింగ్‌తో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అదుర్స్, పటాస్ కామెడీ షోలతో కెరీర్ స్టార్ట్ చేసి, ఇప్పుడు స్టార్ యాంకర్లలో ఒకరిగా కొనసాగుతుంది.

అవార్డు ఫంక్షన్స్, మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్స్, అన్నింటిలో హోస్టుగా వ్యవహరిస్తూ, మంచి పాపులారిటీ సంపాదించుకుంటుంది. ముఖ్యంగా ఈ బ్యూటీ బిగ్ బాస్‌కు వెళ్లి వచ్చిన తర్వాత మరింత పాపులారిటీ సంపాదించుకుంది.

బిగ్ బాస్ తర్వాత ఈ బ్యూటీని అవకాశాలు ఎక్కువగా వరించాయి. దీంతో బుల్లితెరపైనే కాకుండా సిల్వర్ స్క్రీన్ పై కూడా సందడి చేసింది ఈ చిన్నది. స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి, తన నటనతో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది.

ఇక ప్రస్తుతం వరసగా షోలు, ఈవెంటన్స్‌తో ఫుల్ బిజీగా గడిపేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఏ కాస్త సమయం దొరికినా సరే సోషల్ మీడియాలో హంగామా చేస్తుంటుంది. తాజాగా ఈ చిన్నది బ్లాక్ కలర్ డ్రెస్‌లో తన అందాలతో అందరినీ ఆకట్టుకుంది.