తన కెరీర్ స్టార్టింగ్‌లో విన్న మాటలు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతూనే ఉన్నాయంటున్నారు అనన్య పాండే.. 'నీకూ.. స్మార్ట్ టీవీ స్క్రీన్‌కీ పెద్ద తేడా లేదు'. 'నీ కాళ్లేంటి? కోడి కాళ్లలాగా అంత సన్నగా ఉన్నాయి'.

'అసలు నువ్వెంత బక్కగా ఉన్నావో చూసుకున్నావా?', ' మనిషన్నాక కాసింత కండ ఉండాలి... మరి నువ్వేంటి అగ్గిపుల్లలాగా ఉన్నావ్?' .. అంటూ తన గురించి అవతలివాళ్లు చేసిన కామెంట్లు వినీ వినీ విసుగొచ్చిందంటున్నారు అనన్య.

గట్టిగా 18 ఏళ్లు నిండక ముందే ఇండస్ట్రీకి వచ్చానని అన్నారు లైగర్ బ్యూటీ. అప్పుడు తాను సన్నగానే ఉండేదానన్ని చెప్పారు. మహిళల ఫిజిక్ గురించి మాట్లాడినంతగా, ఈ సొసైటీ మగవారిని పట్టించుకోదని చెప్పారు. మేల్ డామినేటెడ్ ఇండస్ట్రీలో ముందడుగు వేయడానికి ఎంతో సంయమనంతో వ్యవహరిస్తున్న సమయంలో, ఫిజిక్ పరంగా ఎదురయ్యే స్ట్రెస్‌ని తట్టుకోవడం అంత ఈజీ కాదంటున్నారు ఈ బ్యూటీ.

రీసెంట్‌గా అనన్య జఘన సౌందర్యానికి శస్త్ర చికిత్స చేయించుకున్నారనే వార్తలు బాలీవుడ్‌లో వైరల్ అయ్యాయి. వీటి గురించి కూడా స్పందించారు అనన్య. నేను అలాంటివేమీ చేయించుకోలేదు.. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాస్త నిండుగా కనిపిస్తున్నాను. అంత మాత్రానికే నోటికి వచ్చినట్టు మాట్లాడేవారిని చూస్తుంటే ఏవగింపుగా ఉందన్నారు.