
ఇదే జరిగితే బాలీవుడ్‌లో సోలోగా 800 కోట్లు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా జరిగితే.. నిర్మాత మైత్రి రవి చెప్పినట్లు 2000 కోట్ల క్లబ్బులో చేరుతుందేమో..?

ఆ తర్వాత ఐదేళ్ళకు 2022లో ట్రిపుల్ ఆర్‌తో రెండోసారి.. 2024లో కల్కితో మూడోసారి.. తాజాగా పుష్ప 2తో నాలుగోసారి తెలుగు సినిమాలకు 1000 కోట్లు వచ్చాయి.

పుష్పరాజ్ మేనియా బాలీవుడ్ మేకర్స్‌ను కూడా భయపెడుతోంది. ఇంకా సీరియస్‌గా ప్రమోషన్స్ స్టార్ట్ చేయకముందే పుష్ప 2ని చూసి నార్త్ మేకర్స్ భయపడుతున్నారు.

అన్ని ఏరియాల్లో ఆల్ టైమ్ రికార్డ్ కొట్టడం పక్కా అంటున్నారు డిస్ట్రిబ్యూటర్స్. ముఖ్యంగా కన్నడలో కేజీఎఫ్ ఏ స్థాయిలో రిలీజ్ అయ్యిందో అంతకు మించి ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా వెల్లడించిన కన్నడ డిస్ట్రిబ్యూటర్స్, వసూళ్లు కూడా అదే స్థాయిలో ఉంటాయన్నారు.

అది కూడా ఎక్కువగా బీ సీ సెంటర్ల మీదే దృష్టి పెడుతున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ మూవీ కాబట్టి మాస్ ఆడియన్సే మెయిన్ ఎసెట్ అని భావిస్తున్నారు.

రెండు నిమిషాల 44 సెకన్ల నిడివితో ఉన్న ట్రైలర్ అలా రిలీజ్ అయిందో లేదో.. ఇలా వ్యూస్ అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. ట్రైలర్‌లో ప్రతి కేరక్టర్ గురించీ మాట్లాడుకుంటున్నారు జనాలు.

అసలు ఏ ఇండస్ట్రీకి ఎన్ని 1000 కోట్ల సినిమాలున్నాయి.? అసలు ఆ క్లబ్బులో లేని ఇండస్ట్రీలేవి.? వాళ్లెందుకు రాలేదు.? ఇవన్నీ చూద్దామా.?