
దెబ్బకు దేశమంతా ఊగిపోతుందంతే. ఆగస్ట్ 15న పుష్ప 2 రానుంది. అంటే ఇంకా మూడు నెలలే టైమ్ ఉందన్నమాట. రాబోయే 90 రోజులు పుష్ప 2కు కీలకంగా మారింది. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు..

అలాగే భన్వర్‌సింగ్ షెకావత్ కోసం కూడా క్యూరియాసిటీ కనిపిస్తోంది. ఫస్ట్ పార్టులో చూసింది జస్ట్ శాంపిలే, సిసలైన కేరక్టర్ సెకండ్ హాఫ్‌లోనే ఉంటుందని చెప్పి జనాలను ఊరించేశారు సుకుమార్. పార్ట్ 2 లో ఆ అంచనాలను అందుకోవడానికి ప్రాజెక్ట్ ని పర్ఫెక్ట్ గా షేప్ చేస్తున్నారు సుకు.

రిలీజ్ టెన్షన్ మీద పడుతున్నా, అన్నీ విషయాల్లోనూ ఇంత పగడ్బంధీగా ఎలా ఉండగలుగుతున్నారంటూ ఆశ్చర్యపోతున్నారు జనాలు. రిలీజ్‌కి రెడీ అవుతున్న అప్‌కమింగ్ సినిమాలు చాలా వరకు పుష్ప ప్రమోషన్ల మీద ఓ కన్నేసే ఉంచుతున్నాయి.

మరి మిగిలిన షూట్ ఎప్పుడు పూర్తి చేస్తారు..? ప్రమోషన్ ఎప్పుడు మొదలు పెడతారు..? అసలు రాబోయే 90 రోజుల్లో పుష్ప మేకర్స్ ప్లానింగ్ ఎలా ఉండబోతుంది..? ముందు నుంచే పుష్ప 2పై ఉన్న అంచనాలు వేరు..

యాక్షన్‌కి యాక్షన్‌కి, పెర్ఫార్మెన్స్ కి పెర్ఫార్మెన్స్.. అన్నిటికీ మాంఛి స్కోప్ లభించింది. చీరకట్టులో బన్నీ ఒక్కో ఫ్రేమ్‌లో కదులుతుంటే మాస్ జాతరకి సిసలైన అర్థం ఇదే కదా అని అనిపించకమానదు.

మరోవైపు ప్రమోషన్లు కూడా అంతే వేగంగా, ప్లాన్డ్ గా జరుగుతున్నాయి. ఇవ్వబోయే అప్‌డేట్ ముందు నుంచే సోషల్ మీడియాలో మారుమోగుతోంది. అప్‌డేట్ వచ్చాక ఆ ట్రెండ్ కంటిన్యూ అవుతోంది.

పైగా స్పెషల్ సాంగ్ చిత్రీకరణ, ఫహాద్ ఫాజిల్ సీన్స్ బ్యాలెన్స్. దీంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులుంటాయి. ఆఘమేఘాల మీద అన్నీ పూర్తి చేస్తే కానీ అనుకున్న టైమ్‌కు పుష్ప 2 రావడం కష్టమే. పుష్పకు కూడా చివరి నిమిషం వరకు ఇలాగే పని చేసారు టీం.