
ఇండియాస్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన పుష్ప 2 మరోసారి టాప్‌లో ట్రెండ్ అవుతోంది. గురువారంతో 2 నెలలు పూర్తి చేసుకుంది ఈ సినిమా. ఈ మూమెంట్‌ను గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్.

ఇండియన్ స్క్రీన్ మీద అన్ని కలెక్షన్ రికార్డులు పుష్పరాజ్ ఖాతాలో చేరటంతో మరింత జోష్‌లో ఉన్నారు బన్నీ ఫ్యాన్స్. అల్లు అర్జున్ నెక్ట్స్ మూవీ అప్‌డేట్స్ కూడా అభిమానుల్లో అంచనాలు పెంచేస్తున్నాయి.

త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ నెక్ట్స్ మూవీ చేస్తారన్న విషయంలో ఆల్రెడీ క్లారిటీ వచ్చేసింది. ఈ నెలలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫైనల్ డ్రాఫ్ట్ బన్నీకి వినిపించబోతున్నారు త్రివిక్రమ్, అదే టైమ్‌లో అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది.

పుష్ప2 తరువాత బన్నీ చేస్తున్న సినిమా.... త్రివిక్రమ్ తొలి పాన్ ఇండియా మూవీ కావటంతో ఆల్రెడీ ఈ కాంబో మీద అంచనాలు భారీగా ఉన్నాయి. అందుకే ఎనౌన్స్‌మెంట్ మీద కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్న మేకర్స్, ఓ వీడియోతో సినిమాను భారీగా ఎనౌన్స్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఆల్రెడీ జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలతో హ్యాట్రిక్ కొట్టిన బన్నీ - త్రివిక్రమ్, ఈ సారి నేషనల్ లెవల్‌లో టార్గెట్ చేస్తున్నారు. అంత వర్కౌట్ అయితే ఇంకోసారి బన్నీ ఊచకోత పక్క అనే చెప్పాలి.