
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు జపాన్ లో పర్యటిస్తున్నాడు. తన భార్య అల్లు స్నేహ రెడ్డి, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి చారిత్రాత్మక ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలను చుట్టేస్తున్నారు.

ఇందుకు సంబంధించిన ఫొటోలను అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

జపాన్ రాజధాని టోక్యోలో పురాతన ఆలయంగా పేరొందిన బౌద్ధ సెన్సో-జి ఆలయాన్ని అల్లు ఫ్యామిలీ దర్శించుకుంది. అలాగే అక్కడున్న టూరిస్ట్ ప్రాంతాలన్నింటినీ చుట్టేస్తోందీ అల్లు ఫ్యామిలీ.

ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేసిన పుష్ప 2 ది రూల్ జనవరి 16న జపాన్ లో కూడా విడుదలైంది. దీనికి అక్కడి ప్రేక్షకుల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమా ప్రమోషన్లలోనూ చురుగ్గా పాల్గొంటున్నాడు అల్లు అర్జున్. అక్కడి మీడియా సంస్థలకు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అలాగే అభిమానులతోనూ సమావేశమవుతున్నారు.

ఇక పుష్ప2 తర్వాత కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు అల్లు అర్జున్. బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.