
పుష్ప రాజ్ గా సినిమా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అల్లు అర్జున్ మరో ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. పుష్ప సినిమాలో అద్భుత నటనకు గానూ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు. ఈ ఏడాది ఆగస్టులో జాతీయ అవార్డులను ప్రకటించగా తాజాగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వీటిని ప్రదానం చేశారు. (Photo Courtesy: DD National)

పుష్ప సినిమాకు గానూ ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకున్నారు అల్లు అర్జున్. తద్వారా 69 ఏళ్ల జాతీయ సినిమా అవార్డుల చరిత్రలో ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్న తొలి తెలుగు హీరోగా బన్నీ చరిత్ర సృష్టించారు.(Photo Courtesy: DD National)

ఇదే పుష్ప సినిమాకు గానూ జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నాడు దేవిశ్రీ ప్రసాద్. అలాగే మిమీ సినిమాకు గానూ కృతి సనన్, గంగూబాయి కతియావాడి సినిమాకు గానూ జాతీయ ఉత్తమ నటీమణులుగా ముర్ము చేతుల మీదుగా పురస్కారం అందుకున్నారు. (Photo Courtesy: DD National)

ఇక రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా, ఉత్తమ సంగీత దర్శకత్వం (ఎమ్ ఎమ్ కీరవాణి), ఉత్తమ నేపథ్య గాయకుడు( కాల భైరవ), ఉత్తమ నృత్య దర్శకుడు (ప్రేమ్ రక్షిత్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ (శ్రీనివాస్ మోహన్), ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్‌గా కింగ్ సోలోమన్ జాతీయ అవార్డులు అందుకున్నారు. (Photo Courtesy: DD National)

మొత్తమ్మీద జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాకు పట్టం కట్టారు. ఏకంగా ఆరు పురస్కారలు లభించాయి. దీంతో అవార్డు పొందిన నటీనటులకు సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లు వెత్తుతున్నాయి. (Photo Courtesy: DD National)