Phani CH | Edited By: Rajeev Rayala
Oct 02, 2021 | 5:57 PM
టాలీవుడ్ రొమాంటిక్ కపుల్ బిగ్ డెసిషన్ తీసుకున్నారు.
ఎప్పటి నుంచో వినిపిస్తున్న మాటే అయినా.. అఫీషియల్ కన్ఫార్మేషన్‌తో ఫ్యాన్స్, ఇండస్ట్రీ జనాలు షాక్ అయ్యారు.
రీసెంట్‌గా సాకీ యానివర్సరీ సందర్భంగా మాట్లాడిన సామ్… అన్నీ రూమర్స్ అంటూ సామ్ చెప్పటంతో డైవర్స్ న్యూస్ ఫాల్స్ అని ఫీల్ అయ్యారు ఫ్యాన్స్.
కానీ డైవర్స్ ఎనౌన్స్‌మెంట్‌తో షాక్ ఇచ్చారు సామ్. అసలు ఇలాంటి న్యూస్ వస్తుందంటే ఇండస్ట్రీ జనాలు కూడా నమ్మలేదు.
దాదాపు చై సామ్‌ది దాదాపు 11 ఏళ్ల బంధం. ఏడేళ్ల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. పెద్దలను ఒప్పించి పెళ్లిచేసుకున్నారు.
ఒకరి మీద ఒకరి ప్రేమను ఎన్నో రకాలుగా చూపించారు.
ముఖ్యంగా తన శరీరం మీద చైతూ గుర్తులను టాటూలుగా వేయించుకున్నారు సామ్.
తన ప్రేమకు గుర్తుగా సమంత మూడు టాటూలు వేయించుకున్నారు. చైతూ తో తన బంధాన్ని గుర్తు చేసేలా ఆ టాటూస్ డిజైన్ చేశారు.
తన జీవితా భాగస్వామిని తనకు చూపించిన ఏం మాయ చేసావే సినిమా పేరుకు షార్ట్ ఫామ్ YMC అనే అక్షరాలు తన మెడ వెనుక భాగంలో టాటూ వేయించుకున్నారు సామ్.
ఓ ఫోటో షూట్‌లో ఆ టాటూ రివీల్ అవ్వటంతో చాలా రోజుల క్రితమే ఈ టాటూ వేయించుకున్నా.. ఇది సీక్రెట్ అని చెప్పుకొచ్చారు. ఇలా తమ ప్రేమను టాటూ రూపంలో పదిలం చేసుకున్న సమంత… ఇప్పుడు డైవర్స్ నిర్ణయం తీసుకోవటంతో అభిమానులకు షాకిస్తోంది.