
అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన్నా. ఇక ఇటీవలే బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్ బీర్ కపూర్ తో కలిసి నటించిన యానిమల్ కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో అటు సౌత్ లోనూ, ఇటు నార్త్ లోనూ రష్మిక పేరు మార్మోగిపోతోంది.

ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2, ధనుష్ కుబేర, అలాగే గర్ల్ ఫ్రెండ్ అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీలోనూ నటిస్తోందీ నేషనల్ క్రష్.

ఇటీవలే పుష్ప 2 మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకున్న రష్మిక.. లేటెస్ట్ గా కుబేర సెట్ లో అడుగుపెట్టింది. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తున్నాడు.

టాలీవుడ్ సెన్సిబుల్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తోన్న ఈ పాన్ ఇండియా సినిమాలో అక్కినేని నాగార్జున కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నారు.

కుబేర షూటింగ్ ఇటీవలే ముంబైలో లాంఛనంగా ప్రారంభమైంది. ఇటీవలే ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది రష్మిక మందన్న. ప్రస్తుతం ధనుష్, రష్మికలపై లవ్‌సీన్లును చిత్రీకరిస్తున్నారు.