
స్టార్ డైరెక్టర్ క్రిష్! హరి హర వీర మల్లు సినిమా కదలకుండా ఆగింది మొదలు.. అసలు కెమెరా కంటికి చిక్కకుండా.. సోషల్ మీడియాలో కనిపిండకుండా పోయారు. హర హర వీరమల్లు సినిమా ఎలక్షన్స్ ముందే రిలీజ్ అవుతుందన్న ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం కామెంట్లు నేపథ్యంలో ఈ స్టార్ డైరెక్టర్, ఎప్పుడోడప్పుడు బయటికి వస్తారనే అందరూ అనుకున్నారు.

పవన్ మోస్ట్ అవేటెడ్ మూవీ అప్టేట్స్ ఖచ్చితంగా త్వరలోనే ఇస్తారనుకున్నారు అందరూ! కానీ కట్ చేస్తే.. 'అలా నిన్ను చేరి' అంటూ అందరి ముందు ఫ్లాష్ అయ్యారు ఈ ట్యాలెంటెడ్ డైరెక్టర్.ఇక అసలు విషయం ఏంటంటే.. రీసెంట్ డేస్‌లో ఎప్పుడూ తన హరి హర సినిమా పనులతోనే బిజీగా ఉన్న స్టార్ డైరెక్టర్ క్రిష్.. వీలైనప్పుడు చిన్న సినిమాలను సపోర్ట్ చేస్తుంటారు.

ట్యాలెంట్ ఉన్నమేకర్స్‌ను అప్రిషియేట్ చేస్తుంటారు. ఇక తాజాగా కూడా అదే చేశారు. తన చేతుల మీదుగా.. 'అలా నిన్ను చేరి' సినిమా టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ సుభాష్ ఆనంద్ కపోంజింగ్.. ఆస్కార్ విన్నర్ చంద్రబోస్ లిరిక్స్ బాగుందంటూ.. మెచ్చుకున్నారు. ఈ మూవీ మేకర్స్ ను విష్ చేస్తూనే .. సినిమా హిట్ కావాలని మనసారా కోరుకున్నారు.

ఇక దినేష్ తేజ్, హెబ్బా పటేల్, పాయల్ రాధాకృష్ణ లీడ్ రోల్స్‌లో.. మారేష్ శివన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రమే 'అలా నిన్ను చేరి'. విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై కొమ్మాలపాటి శ్రీధర్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ జోనర్లో తెరకెక్కుతోంది.

ఇక ఈ సాంగ్ ఇప్పటికే యూత్ నుంచి మంచి రెస్పాన్స్ రాబట్టుకుంటూ ఉండడంతో.. జనాల్లో కూడా మంచి అంచనాలను పెంచుకుంటోంది అలా నిన్ను చేరి ఫిల్మ్.